Skip to main content

బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం

పశ్చిమబెంగాల్‌లోని నారాయణ్‌గఢ్-ఒడిశాలోని భద్రక్ మధ్య రెల్వే శాఖ మూడో లైన్‌ను నిర్మించేందుకు కేంద్ర మంత్రి మండలి మార్చి 7న ఆమోదం తెలిపింది.
ఈ మార్గంలో రద్దీ తీవ్రంగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 155 కి.మీ మేర కొత్త ట్రాక్ వేయనున్నారు. ఈ మార్గం నిర్మాణానికి రూ.1,866.31 కోట్ల మేర వ్యయం అవుతుందని అంచనా వేయగా, 2024 నాటికి ఈ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు వల్ల 37.2 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది.

కేంద్ర మంత్రి మండలి మరికొన్ని నిర్ణయాలు
  • ముంబై అర్బన్ ట్రాన్స్ పోర్టు ప్రాజెక్టు (ఎంయూటీపీ)లో భాగంగా మూడో దశకు కేంద్ర మంత్రివర్గం సమ్మతించింది. ఇందుకు రూ. 30,849 కోట్ల మేర వ్యయం కావొచ్చని అంచనా వేశారు. ఐదేళ్లలోపు పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
  • ఢిల్లీలో ప్రతిపాదిత మెట్రో నాలుగో దశలో భాగంగా మరో మూడు కారిడార్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ముకుంద్‌పూర్-మౌజ్‌పూర్, ఆర్కే ఆశ్రమ్-జనక్‌పురి వెస్ట్, ఏరోసిటీ-తుగ్లకాబాద్ మధ్య వీటి నిర్మాణం జరగనుంది. ఇందులోభాగంగా 17 భూగర్భ స్టేషన్లు, 29 ఎలివేటెడ్ స్టేషన్లను నిర్మిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
బెంగాల్-ఒడిశా మధ్య మూడోలైన్‌కు ఆమోదం
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : కేంద్ర మంత్రి మండలి
Published date : 08 Mar 2019 04:40PM

Photo Stories