బెల్‌గ్రేడ్ స్విమ్మింగ్ టోర్నీలో స్వర్ణ పతకాలు సాధించిన స్విమ్మర్లు?
Sakshi Education
బెల్‌గ్రేడ్ ట్రోఫీ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో... భారత అగ్రశ్రేణి స్విమ్మర్లు సజన్ ప్రకాశ్ (కేరళ), శ్రీహరి (తమిళనాడు)లు స్వర్ణ పతకాలు సాధించారు.
అయితే టోక్యో ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించేందుకు అవసరమైన ‘ఎ’ గ్రేడ్ ప్రమాణాన్ని అందుకోలేకపోయారు. సెర్బియా రాజధాని బెల్‌గ్రేడ్‌లో జూన్20న జరిగిన 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో సజన్ ప్రకాశ్.. 1ని:56.96 సెకన్లలో గమ్యానికి చేరి 1:57.73 సెకన్లతో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తిరగరాశాడు. శ్రీహరి 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్ ఫైనల్‌ను 54.45 సెకన్లలో ముగించి విజేతగా నిలిచాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెల్‌గ్రేడ్ ట్రోఫీ స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారతీయులు?
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : సజన్ ప్రకాశ్ (కేరళ), శ్రీహరి (తమిళనాడు)
ఎక్కడ : బెల్‌గ్రేడ్, సెర్బియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : బెల్‌గ్రేడ్ ట్రోఫీ స్విమ్మింగ్ కాంపిటీషన్‌లో స్వర్ణ పతకాలు గెలుచుకున్న భారతీయులు?
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : సజన్ ప్రకాశ్ (కేరళ), శ్రీహరి (తమిళనాడు)
ఎక్కడ : బెల్‌గ్రేడ్, సెర్బియా
Published date : 21 Jun 2021 07:48PM