బెడైన్ సంచలనం నిర్ణయం..అమెరికా చరిత్రలో తొలిసారిగా
Sakshi Education
వాషింగ్టన్ : నూతనంగా ఎన్నికై న అధ్యక్షుడు జో బెడైన్ .. ట్రంప్ అధ్యక్ష కాలంలో ముదిరిన జాత్యాంహకార ఆందోళనలు దృష్టిలో పెట్టుకుని సంచలన నిర్ణయం తీసుకున్నారు.
అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ని రక్షణ శాఖ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. బరాక్ ఒబామా ఆధ్వర్యంలో మధ్యప్రాచ్యంలో అమెరికన్ దళాలను పర్యవేక్షించిన రిటైర్డ్ జనరల్ లాయిడ్ ఆస్టిన్ ని ఈ అత్యున్నత పదవికి బెడైన్ ఎన్నుకున్నారు. 2003లో అమెరికా దళాలను బాగ్దాద్‌లోకి నడిపించి, యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అధిపతిగా ఎదిగారు లాయిడ్ ఆస్టిన్. తన కేబినెట్‌లో మైనారీటీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్న రక్షణ శాఖ మాజీ అండర్ సెక్రటరీ మిచెల్ ఫ్లోర్నోయ్ ఒత్తిడి మేరకు 67 ఏళ్ల ఫోర్ స్టార్ ఆర్మీ జనరల్ అయిన లాయిడ్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సీఎన్‌ఎన్, న్యూయార్క్ టైమ్స్‌లు పేర్కొన్నాయి. బెడైన్ డిసెంబర్ 11వ తేదీన ఆస్టిన్ నియామకం గురించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పదవి చేపట్టడానికి ముందు ఆస్టిన్ కు సెనేట్ అంగీకారం అవసరమని సమాచారం.
నాలుగు దశాబ్దాలపాటు...
ఆస్టిన్ నాలుగు దశాబ్దాలపాటు అమెరికా ఆర్మీకి సేవలు అందించారు. 2003లో 3వ ఇన్ఫాంట్రీ డివిజన్ కు అసిస్టెంట్ డివిజన్ కమాండర్‌గా వ్యవహరించిన ఆస్టిన్ ఇరాక్‌పై దాడిలో యూఎస్ సేనలను కువైట్ నుంచి బాగ్దాద్‌లోకి నడిపించారు. 2010లో ఇరాక్‌లోని అమెరికా దళాలకు కమాండింగ్ జనరల్‌గా నియమితులైన ఆస్టిన్..రెండేళ్ల తర్వాత మధ్యప్రాచ్యం, అఫ్గానిస్తాన్ లలో పెంటగాన్ కార్యకలాపాలకు బాధ్యత వహించే సెంట్రల్ కమాండ్‌కు కమాండర్‌గా వ్యవహరించారు. 2016లో మిలటరీ నుంచి రిటైర్ అయిన ఆయన అనంతరం పెంటగాన్ అతిపెద్ద కాంట్రాక్టర్స్‌లో ఒకటైన రేథియాన్ టెక్నాలజీస్ బోర్డు ఆఫ్ డెరైక్టర్లలో చేరారు.
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో...
ఇక ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో బెడైన్ కి, ఆస్టిన్ మధ్య మంచి సంబంధాలుండేవి. ఇక వచ్చే ఏడాది జనవరి 20న అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న బెడైన్ సోమవారం హెల్త్ సెక్టర్‌లోకి తాను తీసుకోబోతున్న ప్రముఖ వ్యక్తుల పేర్లు వెల్లడించారు. కరోనావైరస్‌పై యుద్ధంలో వీరు బెడైన్ కు బాసటగా నిలవనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి : అమెరికా చరిత్రలో తొలిసారి ఓ ఆఫ్రికన్-అమెరికన్‌ని రక్షణ శాఖ మినిస్టర్‌గా ఎంపిక
ఎవరు : లాయిడ్ ఆస్టిన్
ఎక్కడ : అమెరికా

Published date : 08 Dec 2020 02:34PM