బాల్య వివాహాల నిర్మూలనకు అరుంధతి స్వర్ణ పథకం
Sakshi Education
బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా అస్సాం ప్రభుత్వం ‘అరుంధతి స్వర్ణ యోజన’ పేరుతో నూతన పథకాన్ని ప్రవేశపెట్టింది.
2020, జనవరి 1 నుంచి ఈ పథకం అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ పథకం ప్రకారం అస్సాంలో జరిగే పెళ్లిళ్లలో పెళ్లికూతురికి తులం(10 గ్రాముల) బంగారానికి సమానమైన సొమ్మును ఇస్తారు. అయితే వధూవరులు కనీసం పదోతరగతి వరకు చదివి ఉండాలని, వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని, కుటుంబ వార్షిక ఆదాయం 5 లక్షల లోపే ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం షరతులు పెట్టింది. అంటే వధువుకు కచ్చితంగా చట్టపరమైన వివాహ వయస్సు వచ్చి ఉండాలి. అసోంలో ఏటా 3 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నా, కేవలం 60 వేలలోపు పెళ్లిళ్లే రిజిస్టర్ అవుతున్నాయని ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి బిశ్వ శర్మ తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుంధతి స్వర్ణ యోజన పేరుతో నూతన పథకం అమలు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా
క్విక్ రివ్యూ :
ఏమిటి : అరుంధతి స్వర్ణ యోజన పేరుతో నూతన పథకం అమలు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : అస్సాం ప్రభుత్వం
ఎక్కడ : అస్సాం
ఎందుకు : బాల్య వివాహాలను నిర్మూలించే ప్రయత్నంలో భాగంగా
Published date : 22 Nov 2019 06:20PM