Skip to main content

బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న క్రీడాకారులు?

ప్రొిఫెషనల్ కెరీర్‌ను అజేయంగా ముగించిన అమెరికా దిగ్గజ బాక్సర్లు ఫ్లాయిడ్ మేవెదర్, మహిళా స్టార్ లైలా అలీ <b>‘‘అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్’’</b> జాబితాలో చోటు దక్కించుకున్నారు.
Current Affairs 2021 ఏడాది కోసం ప్రకటించిన ఈ జాబితాలో మేవెదర్, లైలా అలీతో పాటు హెవీవెయిట్ మాజీ చాంపియన్ వ్లాదిమిర్ క్లిచ్కో (ఉక్రెయిన్), ఒలింపిక్ మాజీ చాంపియన్ ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్‌మన్‌లకు చోటు దక్కింది. మరణానంతరం డేవీ మూర్, జాకీ, బ్రౌన్ తదితరులకు ఆ జాబితాలో చోటు కల్పించారు.

లైలా అలీ...
జగద్విఖ్యాత బాక్సర్ మొహమ్మద్ అలీ కుమార్తె అయిన 42 ఏళ్ల లైలా అలీ తన కెరీర్‌లో 24-0 రికార్డుతో ప్రతి బౌట్ గెలిచింది. 21 పోటీల్లో నాకౌట్ విజయాలు సాధించింది. పురుషుల విభాగంలో 43 ఏళ్ల మేవెదర్‌ది కూడా చెక్కుచెదరని రికార్డే. 50-0తో ప్రత్యర్థులకు తలగ్గొని మేవెదర్ ఖాతాలో 27 నాకౌట్ విజయాలున్నాయి.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ బాక్సింగ్ హాల్ ఆఫ్ ఫేమ్’’ జాబితాలో చోటు దక్కించుకున్న క్రీడాకారులు
ఎప్పుడు : డిసెంబర్ 16
ఎవరు : ఫ్లాయిడ్ మేవెదర్, లైలా అలీ, వ్లాదిమిర్ క్లిచ్కో ఆండ్రీ వార్డ్, అన్ వోల్ఫీ, ట్రిమియర్, మార్గరెట్ గుడ్‌మన్
ఎందుకు : బాక్సింగ్‌లో విశేషంగా రాణించినందుకు
Published date : 17 Dec 2020 07:21PM

Photo Stories