అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు: అమెజాన్
Sakshi Education
వచ్చే అయిదేళ్లలో భారత్‌లో 10 లక్షల ఉద్యోగాలు కల్పించనున్నట్లు అమెరికాకు చెందిన ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ వెల్లడించారు.
ఐటీ, నైపుణ్యాల అభివృద్ధి, కంటెంట్ క్రియేషన్, రిటైల్, లాజిస్టిక్స్, తయారీ తదితర రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ కొత్త కొలువులు రానున్నట్లు వివరించారు. మూడు రోజుల భారత పర్యటనకు వచ్చిన బెజోస్ జనవరి 17న ఈ మేరకు తమ ప్రణాళికలను ప్రకటించారు. ఇప్పటికే కల్పించిన ఏడు లక్షల ఉద్యోగాలకు ఇవి అదనమన్నారు.
భారత్‌లో చిన్న, మధ్య తరహా సంస్థ(ఎస్‌ఎంఈ) లు ఆన్‌లైన్ బాట పట్టేలా తోడ్పాటు అందించేందుకు సుమారు రూ. 7,000 కోట్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నట్లు, 2025 నాటికి 10 బిలియన్ డాలర్ల విలువ చేసే మేడిన్ ఇండియా ఉత్పత్తులను ఎగుమతి చేయనున్నట్లు బెజోస్ ఇప్పటికే ప్రకటించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అయిదేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు సృష్టి
ఎప్పుడు : జనవరి 17
ఎవరు : అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్
ఎక్కడ : భారత్

Published date : 18 Jan 2020 05:39PM