Skip to main content

ఔట్‌రీచ్ సదస్సులో ఏపీ సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ఆగస్టు 9న నిర్వహించిన దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధుల (డిప్లొమాటిక్ ఔట్‌రీచ్) సదస్సులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమన్వయంతో నిర్వహించిన ఈ సదస్సులో 25 దేశాల నుంచి 50 మందికి ప్రతినిధులు హాజరయ్యారు. అందులో 16 దేశాల రాయబారులు ఉన్నారు. ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి అవసరమైన వాతావరణం కల్పిస్తామన్నారు. ప్రతి లావాదేవీలోనూ పారదర్శకత తప్పనిసరిగా ఉండాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం వచ్చిన 60 రోజుల్లో కొన్ని విప్లవాత్మకమైన మార్పులు చేపట్టిందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావాలని విదేశీ ప్రతినిధులను, పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : డిప్లొమాటిక్ ఔట్‌రీచ్ సదస్సు
ఎప్పుడు : ఆగస్టు 9
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : విజయవాడ, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Aug 2019 07:42PM

Photo Stories