Skip to main content

ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు

చైనాలో కోవిడ్ 19 (కరోనా వైరస్) ప్రబలిన నేపథ్యంలో దేశీయంగా ఔషధాల లభ్యతకు సమస్యలు లేకుండా చూడటంపై కేంద్రం దృష్టి సారించింది.
Current Affairsఇందులో భాగంగా 26 యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియంట్స్ (ఏపీఐ), ఔషధాల ఎగుమతులపై మార్చి 3న ఆంక్షలు విధించింది. పారాసెటమల్, విటమిన్ బీ1, బీ12 మొదలైనవి ఈ జాబితాలో ఉన్నాయి. తాజా ఆంక్షలతో ఇకపై వీటి ఎగుమతుల కోసం డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్‌టీ) నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. తదుపరి ఆదేశాలిచ్చే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని డీజీఎఫ్‌టీ వెల్లడించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఔషధాల ఎగుమతులపై ఆంక్షలు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : భారత ప్రభుత్వం
ఎందుకు : కోవిడ్19 వ్యాప్తి నేపథ్యంలో
Published date : 04 Mar 2020 05:38PM

Photo Stories