అత్యంత వేడి మాసంగా జూలై
Sakshi Education
భూ గ్రహ చరిత్రలోనే 2019 జూలై నెల అత్యంత వేడి మాసంగా నమోదైంది.
ఈ విషయాన్ని గతంలోనే యూరోపియన్ యూనియన్ వెల్లడించగా, తాజాగా అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్‌వోఏఏ) కూడా ఆగస్టు 15న ధ్రువీకరించింది.
ఎన్‌వోఏఏ తెలిపిన వివరాల ప్రకారం..
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత వేడి మాసంగా జూలై
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్‌వోఏఏ)
ఎన్‌వోఏఏ తెలిపిన వివరాల ప్రకారం..
- 20వ శతాబ్దంలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 15.8 డిగ్రీ సెల్సియస్ కాగా, తాజాగా 2019, జూలైలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 16.75 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
- 2016 జూలై రెండో ఇప్పుడు ప్రపంచంలో రెండో అత్యంత వేడి మాసంగా ఉంది.
- పది అత్యంత వేడి జూలై మాసాల్లో తొమ్మిది 2005 తర్వాతనే నమోదయ్యాయి.
- ఆర్కిటిక్ సముద్రంలో మంచు సాధారణంగా జూలై నెలలో ఉండే సగటు కన్నా 2019 ఏడాది జూలై నెలలో 19.8 శాతం తక్కువగా ఉంది. అంటార్కిటికాలోనూ సగటు కన్నా 4.3 శాతం తక్కువ మంచు ఉంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యంత వేడి మాసంగా జూలై
ఎప్పుడు : ఆగ స్టు 15
ఎవరు : అమెరికా జాతీయ వాతావరణ, సముద్ర పరిశీలన సంస్థ (ఎన్‌వోఏఏ)
Published date : 16 Aug 2019 04:24PM