Skip to main content

అత్యంత సురక్షిత నగరంగా టోక్యో

ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా జపాన్ రాజధాని టోక్యో నిలిచింది.
ఈ మేరకు ప్రపంచంలోని 60 సురక్షితమైన నగరాల జాబితా-2019కి సంబంధించిన నివేదికను ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆగస్టు 29న విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం టోక్యో తన మొదటి స్థానాన్ని మూడోసారీ పదిలం చేసుకోగా.. సింగపూర్, ఒసాకాలు సైతం తమ పూర్వపు ర్యాంకులను దక్కించుకున్నాయి. 2017లో 23 స్థానంతో సరిపెట్టుకున్న అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ఈసారి 7వ ర్యాంకును సాధించుకుంది. భారత్‌లోని ముంబై 45వ స్థానంలో, ఢిల్లీ 52వ స్థానంలో నిలిచాయి.

అత్యంత సురక్షితమైన నగరాలు

ర్యాంకు

నగరం

దేశం

1

టోక్యో

జపాన్

2

సింగపూర్

సింగపూర్

3

ఒసాకా

జపాన్

4

ఆమ్‌స్టర్‌డ్యామ్

నెదర్లాండ్స్

5

సిడ్నీ

ఆస్ట్రేలియా

6

టొరంటో

కెనడా

7

వాషింగ్టన్

అమెరికా

8

కోపెన్‌హ్యాగన్

డెన్మార్క్

9

సియోల్

దక్షిణ కొరియా

10

మెల్‌బోర్న్

ఆస్ట్రేలియా

20

హంకాంగ్

హంకాంగ్

45

ముంబై

భారత్

52

న్యూఢిల్లీ

భారత్

56

ఢాకా

బంగ్లాదేశ్

57

కరాచీ

పాకిస్తాన్

58

యంగూన్

మయన్మార్

ప్రపంచవ్యాప్తంగా 5 ఖండాలకు చెందిన నగరాల్లోని పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని టాప్-60 సిటీలతో ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఈ నివేదికను ప్రచురించింది. దీనిలో భాగంగా ఆయా నగరాల్లోని సైబర్ భద్రత, వైద్య సదుపాయాలు, వ్యక్తిగత భద్రత, మౌలిక వసతులు వంటి అంశాల మేరకు ర్యాంకులను ప్రకటించింది. ఆసియా-పసిఫిక్ ప్రాంతం డిజిటల్ సెక్యూరిటీలో చాలా మెరుగవ్వాల్సి ఉందని నివేదిక పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన నగరంగా టోక్యో
ఎప్పుడు : ఆగస్టు 29
ఎవరు : ఎకానమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్
Published date : 30 Aug 2019 05:15PM

Photo Stories