Skip to main content

అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్

దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ వరసగా నాలుగోసారి తొలి స్థానంలో నిలిచింది. అధమ స్థానంలో కోల్‌కతా ఉంది.
Current Affairsఈ మేరకు నగరాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య స్థితిగతులపై సర్వే నిర్వహించి రూపొందించిన ‘స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్-2020 ’ ర్యాంకులను కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 31న ప్రకటించింది. రెండు క్వార్టర్‌లుగా విభజించి ప్రకటించిన ఈ జాబితాలో రెండింట్లోనూ ఇండోర్ అగ్రస్థానంలో నిలిచింది. మొదటి క్వార్టర్(ఏప్రిల్-జూన్)లో భోపాల్ (మధ్యప్రదేశ్) రెండవ, సూరత్ (గుజరాత్) మూడవ స్థానంలో నిలిచారుు. రెండో క్వార్టర్ (జూలై-సెప్టెంబర్)లో రాజ్‌కోట్ (గుజరాత్) 2వ, నవీ ముంబై(మహారాష్ట్ర) 3వ స్థానం పొందారుు.

10 లక్షల మంది కన్నా తక్కువ జనాభా కలిగిన నగరాల విభాగంలో జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్ తొలి స్థానంలో నిలిచింది. అలాగే కంటోన్మెంట్ బోర్డుల్లో.. ఢిల్లీ కంటోన్మెంట్ మొదటి స్థానంలో నిలవగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ప్రాంతం పరిశుభ్రత విషయంలో వెనుకబడి ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఇండోర్
ఎప్పుడు : డిసెంబర్ 31
ఎవరు : స్వచ్ఛ సర్వేక్షణ్ లీగ్-2020
ఎక్కడ : దేశంలో
Published date : 01 Jan 2020 06:47PM

Photo Stories