అత్యంత ప్రభావశీలుర జాబితాలో ముకేశ్
Sakshi Education
2019 ఏడాదిగాను టైమ్స్ మ్యాగజైన్ రూపొందించిన ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు 100 మంది’ జాబితాలో భారత్ నుంచి రిలయెన్‌స ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలతో మానవ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు అరుంధతి కట్జూ, మేనక గురుస్వామిలకు చోటు లభించింది.
ఈ మేరకు ఏప్రిల్ 17న టైమ్స్ మ్యాగజైన్ ఈ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఇండో అమెరికన్ కమేడియన్, టీవీ హోస్ట్ హసన్ మిన్‌హాజ్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పోప్ ఫ్రాన్సిస్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్, గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్‌వుడ్‌స, ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరంతా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ముద్ర వేశారో టైమ్స్ వారి ప్రొఫైల్స్‌లో వివరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు 100 మంది’ జాబితా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ముకేశ్ అంబానీ, అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి
క్విక్ రివ్యూ :
ఏమిటి : టైమ్స్ మ్యాగజైన్ ‘ప్రపంచంలో అత్యంత ప్రభావశీలురు 100 మంది’ జాబితా
ఎప్పుడు : ఏప్రిల్ 17
ఎవరు : ముకేశ్ అంబానీ, అరుంధతి కట్జూ, మేనక గురుస్వామి
Published date : 18 Apr 2019 04:36PM