అత్యధిక జనాభా గల దేశంగా భారత్
Sakshi Education
2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరిస్తుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది.
ఈ మేరకు ఐరాసకి చెందిన ఆర్థిక సామాజిక వ్యవహారాల సంస్థకు అనుబంధంగా ఉండే జనాభా విభాగం ‘ప్రపంచ జనాభా అంచనాలు-2019’ పేరిట ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం 2027 నాటికి చైనా జనాభాను భారత్ దాటేస్తుంది. 2019-50 మధ్యనాటికి భారత్‌లో జనాభా 27.3 కోట్లు అదనంగా పెరుగుతుంది. ఈ శతాబ్దం చివరివరకు భారతే ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా కొనసాగుతుంది.
ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు..
2027 నాటికి అత్యధిక జనాభా కలిగిన మొదటి 5 దేశాలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఐరాసకి చెందిన ప్రపంచ జనాభా అంచనాలు-2019 నివేదిక
ఐరాస నివేదికలోని ముఖ్యాంశాలు..
- ప్రస్తుతం భారత్ జనాభా 137 కోట్లయితే, చైనా జనాభా 143 కోట్లుగా ఉంది.
- ప్రపంచవ్యాప్తంగా జనాభా 2019-50 మధ్య నాటికి మరో 200 కోట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- ప్రస్తుత ప్రపంచ జనాభా770 కోట్ల నుంచి 2050 నాటికి 970 కోట్లకు చేరుకోవచ్చు.
- 2010 నుంచి లెక్కలు తీస్తే 27 దేశాల్లో జనాభా ఒక్క శాతం తగ్గుతూ వస్తోంది.
- కొన్ని దేశాల్లో రికార్డు స్థాయిలో జనాభా తగ్గిపోవడానికి సంతాన సాఫల్యత తగ్గిపోవడం, ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు పెరిగిపోవడమే కారణం.
- 2050 నాటికి చైనాలో జనాభా అత్యధికంగా తగ్గిపోతుంది. ఏకంగా 2.2 శాతం తగ్గుదల ఉంటుంది. అంటే చైనా జనాభా 3.14 కోట్లు తగ్గితే అదే సమయంలో భారత్‌లో జనాభా 27.3 కోట్లు పెరగనుంది.
- 2050 నాటికి జనాభా పెరిగే తొమ్మిది దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలుస్తుంది.
- 2050 నాటికి 65 ఏళ్లకు పైబడిన వారు చాలా ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం ప్రతీ 11 మందిలో ఒకరు 65 ఏళ్లకు పైబడి ఉంటే 2050 నాటికి ప్రతీ ఆరుగురిలో ఒకరు 65 ఏళ్ల వయసు దాటినవారే ఉంటారు.
2027 నాటికి అత్యధిక జనాభా కలిగిన మొదటి 5 దేశాలు
దేశం | జనాభా |
భారత్ | 150 కోట్లు |
చైనా | 110 కోట్లు |
నైజీరియా | 73.3 కోట్లు |
అమెరికా | 43.4 కోట్లు |
పాకిస్తాన్ | 40.3 కోట్లు |
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2027 నాటికి ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా భారత్
ఎప్పుడు : జూన్ 18
ఎవరు : ఐరాసకి చెందిన ప్రపంచ జనాభా అంచనాలు-2019 నివేదిక
Published date : 19 Jun 2019 06:06PM