Skip to main content

అత్యాధునిక హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను ప్రారంభించిన మూడో దేశం?

ద్వని కన్నా ఎక్కువ వేగంతో ప్రయాణించే ఇంజన్లను పరీక్షించేందుకు <b> హైదరాబాద్‌లోని ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్‌</b>లో అత్యాధునిక వ్యవస్థ <b>‘‘హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్(హెచ్‌డబ్ల్యూటీ)’’</b>పారంభమైంది.
Edu news

దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఈ టన్నెల్‌ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డిసెంబర్ 19న ఆవిష్కరించారు. దీంతో అమెరికా, రష్యా తర్వాత ఇంత భారీ సైజు హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను కలిగిన మూడో దేశంగా భారత్ నిలిచింది. అత్యాధునిక, సంక్లిష్టమైన వాయుసేన వ్యవస్థలను తయారు చేసుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు ఈ టన్నెల్ ఉపయోగపడుతుంది.

డిసెంబర్ 19న ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ(దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ)లో జరిగిన పైలట్ల పాసింగ్ ఔట్‌పరేడ్‌కు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైదరాబాద్‌కు 43 కి.మీ దూరంలో, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలో దుండిగల్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీ ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అత్యాధునిక హైపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను ప్రారంభించిన మూడో దేశం?
ఎప్పుడు : డిసెంబర్ 19
ఎవరు : భారత్
ఎక్కడ : ఏపీజే అబ్దుల్ కలామ్ మిస్సైల్ కాంప్లెక్స్, హైదరాబాద్
ఎందుకు : అత్యాధునిక, సంక్లిష్టమైన వాయుసేన వ్యవస్థలను తయారు చేసుకోవాలన్న భారత్ ఆకాంక్షలను సాకారం చేసుకునేందుకు

Published date : 21 Dec 2020 08:09PM

Photo Stories