ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ విజేతగా ఒసాకా
Sakshi Education
సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా జపాన్‌కి చెందిన నయోమి ఒసాకా తొలిసారి నిలిచింది.
ఆస్ట్రేలియాలో మెల్‌బోర్న్‌లోని రాడ్ లేవర్ ఎరీనాలో జనవరి 26న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 7-6 (7/2), 5-7, 6-4తో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై విజయం సాధించింది. విజేత ఒసాకాకు 41 లక్షల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 20 కోట్ల 87 లక్షలు)... రన్నరప్ క్విటోవాకు 20 లక్షల 50 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ. 10 కోట్ల 43 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : నయోమి ఒసాకా
ఎక్కడ : రాడ్ లేవర్ ఎరీనా, మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో మహిళల సింగిల్స్ టైటిల్ విజేత
ఎప్పుడు : జనవరి 26
ఎవరు : నయోమి ఒసాకా
ఎక్కడ : రాడ్ లేవర్ ఎరీనా, మెల్‌బోర్న్, ఆస్ట్రేలియా
Published date : 28 Jan 2019 06:24PM