Skip to main content

ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా

ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ భారత పర్యటన వాయిదా పడింది. ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో భారత్ పర్యటనను వాయిదా వేస్తున్నట్లు జనవరి 4న మారిసన్ ప్రకటించారు.
Current Affairsరానున్న నెలల్లో ఇరు దేశాలకు కుదిరే మరో సమయంలో భేటీ జరుగుందని వెల్లడించారు. 2019, జనవరి 13న నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మారిసన్ భారత్‌కు రావాల్సి ఉంది. భారత ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. భారత్‌తో భేటీ అనంతరం ఆయన జపాన్ పర్యటనకు కూడా వెళ్లాల్సి ఉండగా, ఆ పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు.

23 మంది మృతి
ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా ఇప్పటి వరకూ 23 మంది పౌరులు మృతి చెందారు. దీని నుంచి పౌరులను కాపాడేందుకు ఆ దేశ ప్రభుత్వం 3 వేల మంది మిలిటరీ రిజర్వ్ బలగాలను రంగంలోకి దించింది. కార్చిచ్చు గురించి ప్రధాని మోదీ జనవరి 3న మారిసన్‌తో మాట్లాడారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆస్ట్రేలియా ప్రధాని భారత పర్యటన వాయిదా
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : స్కాట్ మారిసన్
ఎందుకు : ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చు నేపథ్యంలో

మాదిరి ప్రశ్నలు
Published date : 06 Jan 2020 06:09PM

Photo Stories