Skip to main content

ఆస్ట్రేలియా ఛారిటీ మ్యాచ్ కోచ్‌గా సచిన్

ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు 2020, ఫిబ్రవరి 8న క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ఛారిటీ మ్యాచ్‌ని నిర్వహిస్తోంది.
Current Affairs ఈ మ్యాచ్‌లో పాల్గొనే ఇరు జట్లకు షేన్ వార్న్, రికీ పాంటింగ్‌లు కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. రికీ పాంటింగ్ జట్టుకు సచిన్ టెండూల్కర్... షేన్ వార్నర్ జట్టుకు కోట్నీ వాల్ష్ కోచ్‌లుగా వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈఓ కెవిన్ రాబర్డ్స్ జనవరి 21న తెలిపారు. మ్యాచ్ ద్వారా వచ్చే మొత్తం ఆదాయాన్ని ఆస్ట్రేలియన్ రెడ్ క్రాస్ డిజాస్టర్ రిలీఫ్ అండ్ రికవరీ ఫండ్‌కు అందజేయనున్నట్లు పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆస్ట్రేలియా ఛారిటీ మ్యాచ్ కోచ్‌గా సచిన్ టెండూల్కర్
ఎప్పుడు : జనవరి 21
ఎవరు : ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు సీఈఓ కెవిన్ రాబర్డ్స్
ఎందుకు : ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధితుల కోసం విరాళాలు సేకరించేందుకు
Published date : 22 Jan 2020 06:19PM

Photo Stories