Skip to main content

ఆసియాలో తొలి సైఫన్ సిస్టం ప్రాజెక్టుకు గండి

ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ప్రాజెక్టు అయిన సరళాసాగర్ ప్రాజెక్టుకు డిసెంబర్ 31న భారీగా గండి పడింది. దీంతో 0.5 టీఎంసీల నీరు రామన్‌పాడు జలాశయానికి చేరింది.
 
Current Affairsఅక్కడ క్రస్టుగేట్లు ఎత్తడంతో ఊకచెట్టు వాగు నుంచి తిరిగి కృష్ణా నదిలోకి నీరు చేరింది. ఇటీవల భీమా, కేఎల్‌ఐ ప్రాజెక్టుల ద్వారా సరళాసాగర్‌లో గరిష్ట స్థాయి నీటిని నిల్వ చేశారు. అయితే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లే నీరు తక్కువగా.. లోనికొచ్చే నీరు ఎక్కువగా ఉండటం, కొన్నేళ్లుగా మరమ్మతులు చేయకపోవడంతో ఒక్కసారిగా గండి పడింది.

ఆసియా ఖండంలోనే తొలి సైఫన్ సిస్టం..

వనపర్తి సంస్థానాన్ని పాలించిన చివరి రాజు, కేంద్ర మాజీ మంత్రి రాజారామేశ్వర్‌రావు తన తల్లి సరళాదేవి పేరున ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టంతో 1947లో ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సుమారు 35 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టును 1959 లో పూర్తి చేశారు. దీని కింద 4,200 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. 2009లో కురిసిన భారీ వర్షాలకు చివరిసారి సైఫన్లు తెరుచుకున్నాయి. తర్వాత ప్రాజెక్టు గరిష్ట స్థాయికి నీరు చేరుకోలేదు.

ఆటోమేటిక్ సైఫన్ సిస్టం : గాలిపీడనంతో కవాటాలు వాటంతట అవే తెరచుకునే పద్ధతి.

మాదిరి ప్రశ్నలు
1. ఆసియా ఖండంలోనే తొలి ఆటోమేటిక్ సైఫన్ సిస్టం ప్రాజెక్టు అయిన సరళాసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది.
1. వరంగల్
2. ఖమ్మం
3. జగిత్యాల
4. వనపర్తి
Published date : 01 Jan 2020 07:20PM

Photo Stories