ఆసియా వెయిట్ లిఫ్టింగ్‌లో జెరేమీకి స్వర్ణం
Sakshi Education
ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత యువ వెయిట్‌లిఫ్టర్ జెరేమీ లాల్‌రినుంగాకు స్వర్ణం పతకం లభించింది.
ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో అక్టోబర్ 22న జరిగిన 67 కేజీల విభాగంలో 16 ఏళ్ల జెరేమీ మొత్తం 299 కేజీల బరువెత్తి విజేతగా నిలిచాడు. అలాగే కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పాడు. 2019, ఏప్రిల్‌లో ఆసియా చాంపియన్‌షిప్‌లో 297 కేజీలతో తాను సృష్టించిన ప్రపంచ రికార్డునే జెరేమీ సవరించాడు. రియాజ్‌కి జునియన్‌సియా (ఇండోనేసియా-287 కేజీలు) రజతం, ఒలిమోవ్ ఖోజిఅక్బర్ (ఉజ్బెకిస్తాన్-273 కేజీలు) కాంస్యం గెలిచారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : జెరేమీ లాల్‌రినుంగా
ఎక్కడ : ప్యాంగ్‌యాంగ్, ఉత్తర కొరియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా జూనియర్, యూత్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : అక్టోబర్ 22
ఎవరు : జెరేమీ లాల్‌రినుంగా
ఎక్కడ : ప్యాంగ్‌యాంగ్, ఉత్తర కొరియా
Published date : 23 Oct 2019 05:58PM