ఆసియా షూటింగ్‌లో మనుకు స్వర్ణం
Sakshi Education
చైనీస్ తైపీలో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ మను భాకర్ స్వర్ణ పతకం గెలుచుకుంది.
మార్చి 29న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత ఈవెంట్ ఫెనల్లో మను 239 పాయింట్లు సాధించి విజేతగా నిలిచింది. ఈ ఈవెంట్‌లో షి హో చింగ్ (హాంకాంగ్-237.9 పాయింట్లు) రజతం... అలాలీ వఫా (యూఏఈ- 216.8 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఈ టోర్నిలో మను భాకర్, శ్రీనివేత, అనురాధాలతో కూడిన భారత బృందం టీమ్ విభాగంలో 1702 పాయింట్లతో కాంస్యం సాధించింది.
మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌టీమ్ ఈవెంట్‌లో సౌరభ్ చౌదరీ, అభిషేక్ వర్మ, రవీందర్‌లతో కూడిన భారత బృందం బంగారు పతకం సాధించింది. భారత బృందం మొత్తం 1742 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని సంపాదించింది. ఈ ఈవెంట్ వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ (240.7 పాయింట్లు) రజతం సాధించాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం
ఎప్పుడు : మార్చి 29
ఎవరు : మను భాకర్
ఎక్కడ : చైనీస్ తైపీ

Published date : 30 Mar 2019 06:15PM