ఆసియా షూటింగ్‌లో భారత్‌కు స్వర్ణం
Sakshi Education
చైనీస్ తైపీలోని తావోయువాన్‌లో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఒక స్వర్ణం, రెండు రజత పతకాలు లభించాయి.
మార్చి 28న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ (జూనియర్) విభాగంలో భారత షూటర్లే స్వర్ణ, రజతాలు గెలుచుకున్నారు. ఇందులో శ్రేయ అగర్వాల్ - యశ్‌వర్ధన్ జోడి మొదటి స్థానంలో నిలవగా (497.3 పాయింట్లు)... మేహులి ఘోష్ - కేవల్ ప్రజాపతికి రెండో స్థానం (496.9 పాయింట్లు) దక్కింది. ఈ ఈవెంట్‌లో కొరియా కాంస్య పతకం సాధించింది.
మరోవైపు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ (సీనియర్) విభాగంలో భారత్‌కి చెందిన ఎలవెనీల్ వలరివన్ - రవి కుమార్ ద్వయం రెండో స్థానంలో (498.4 పాయింట్లు) నిలిచి రజత పతకం దక్కించుకుంది. ఈ పోరులో కొరియా (499.6)కు స్వర్ణం దక్కగా, తైపీ కాంస్యం గెలుచుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
ఎప్పుడు : మార్చి 28
ఎవరు : శ్రేయ అగర్వాల్ - యశ్‌వర్ధన్ జోడి
ఎక్కడ : తావోయువాన్, చైనీస్ తైపీ

Published date : 29 Mar 2019 05:31PM