Skip to main content

ఆసియా షూటింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు

చైనీస్ తైపీలోజరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
మార్చి 27న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్ ఫైనల్లో భారత్‌కి చెందిన మను భాకర్-సౌరభ్ చౌధరీ జంట 484.8 పాయింట్లు స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడంతోపాటు స్వర్ణం సొంతం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో హవాంగ్ సియోన్‌జెయున్-కిమ్ మోస్ (కొరియా-481.1 పాయింట్లు) జంట రజతం... వు చియా యింగ్-కు కువాన్ టింగ్ (చైనీస్ తైపీ-413.3 పాయింట్లు) జోడీ కాంస్యం గెల్చుకున్నాయి. క్వాలిఫయింగ్‌లో మను-సౌరభ్ జంట 784 పాయింట్లు స్కోరు చేసి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు విటాలినా బత్సరష్‌కినా-అర్తెమ్ చెర్ముసోవ్ (రష్యా-782 పాయింట్లు) పేరిట ఉండేది.

మరోవైపు జూనియర్ మిక్స్‌డ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో హైదరాబాద్ షూటర్ ఇషా సింగ్ తన భాగస్వామి విజయ్‌వీర్ సిద్ధూతో కలిసి స్వర్ణం సాధించింది. ఫైనల్లో ఇషా-విజయ్‌వీర్ ద్వయం 478.5 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : మార్చి 27
ఎవరు : మను భాకర్-సౌరభ్ చౌధరీ జంట, ఇషా సింగ్-విజయ్‌వీర్ సిద్ధూ జంట
ఎక్కడ : చైనీస్ తైపీ
Published date : 28 Mar 2019 05:32PM

Photo Stories