Skip to main content

ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా ఎంపికైన భారతీయుడు?

ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ఎంపికయ్యారు.
Current Affairs
నజ్ముల్ హసన్ స్థానంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తనయుడైన 32 ఏళ్ల జై షా ఏసీసీ అధ్యక్షుడిగా నియమితుడైన అతి పిన్న వయస్కుడుగా గుర్తింపు పొందారు.

రంజీ ట్రోఫీకి విరామంత
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ క్రికెట్ టోర్నమెంట్ (మూడు లేదా నాలుగు రోజుల మ్యాచ్‌లు) రంజీ ట్రోఫీకి 2020-2021 సీజన్‌లో బీసీసీఐ విరామమిచ్చింది. కరోనా కారణంగా ఈ సీజన్‌లో చాలా సమయం కోల్పోయిన కారణంగా తాజా సీజన్‌లో ఈ మెగా టోర్నమెంట్‌ను నిర్వహించలేమని జనవరి 30న బీసీసీఐ ప్రకటించింది. 1934-35లో రంజీ ట్రోఫీ మొదలైన తర్వాత టోర్నీ నిర్వహించకపోవడం ఇదే తొలిసారి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) అధ్యక్షుడిగా ఎంపిక
ఎప్పుడు : జనవరి 30
ఎవరు : బీసీసీఐ కార్యదర్శి జై షా
Published date : 03 Feb 2021 05:31PM

Photo Stories