ఆసియా క్రీడల్లో క్రికెట్ కు చోటు
Sakshi Education
ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు దక్కనుంది. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్‌ను ఆడించాలని మార్చి 3న ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) నిర్ణయించింది.
అలాగే ఆస్ట్రేలియాకు ఆసియా క్రీడల్లో అవకాశం కల్పించాలని సిద్ధమైంది. 2018లో ఇండోనేసియాలో జరిగిన క్రీడల్లో క్రికెట్‌ను తొలగించారు. ఆసియా క్రీడల్లో రెండు సార్లు క్రికెట్ ఆడించినా భారత్ మాత్రం బరిలోకి దిగలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా క్రీడల్లో క్రికెట్ కు చోటు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా క్రీడల్లో క్రికెట్ కు చోటు
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ)
Published date : 04 Mar 2019 06:05PM