Skip to main content

ఆసియా ఎయిర్‌గన్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు

చైనీస్‌తైపీలోని తవోయున్‌లో జరుగుతున్న ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు స్వర్ణ పతకాలు లభించాయి.
మార్చి 30న జరిగిన పురుషుల 10 మీ. ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫెనల్లో భారత షూటర్ సరబ్‌జ్యోత్ 237.8 పాయింట్లతో కొరియన్ షూటర్ కిమ్ వూజొంగ్ (236.6)ను ఓడించి పసిడి పతకాన్ని సొతం చేసుకున్నాడు. అలాగే జూనియర్ మహిళల ఈవెంట్ ఫైనల్స్‌లో ఇషా సింగ్(భారత్) యున్ సియోన్‌జియంగ్ (కొరియా; 235) కంటే ఎంతో మెరుగైన స్కోరు (240.1)తో పసిడి నెగ్గింది.

అదేవిధంగా మార్చి 31న జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో భారత షూటర్లు దివ్యాన్‌‌ష సింగ్ పాన్వర్, ఎలవెనీల్ వలరియవన్ బంగారు పతకాలని సాధించారు. పురుషుల వ్యక్తిగత ఈవెంట్‌లో దివ్యాన్‌‌ష, మహిళల ఈవెంట్‌లో ఎలవెనీల్ చెరో స్వర్ణం గెలిచారు. అలాగే 10 మీ. ఎయిర్ రైఫిల్ పురుషుల టీమ్ ఈవెంట్‌లో దివ్యాన్‌‌ష, రవికుమార్, దీపక్ కుమార్‌ల బృందం విజేతగా నిలిచి బంగారు పతకాన్ని నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్‌లోను ఎలవెనీల్, అపూర్వీ, మేఘనలతో కూడిన భారత జట్టు పసిడి పతకాన్ని సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా ఎయిర్‌గన్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ఆరు స్వర్ణాలు
ఎప్పుడు : మార్చి 30, 31
ఎక్కడ : తవోయున్, చైనీస్‌తైపీ
Published date : 01 Apr 2019 05:23PM

Photo Stories