ఆసియా బాక్సింగ్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
Sakshi Education
ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణ పతకాలు లభించాయి.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఏప్రిల్ 26న జరిగిన పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్ పంఘల్ 5-0తో కిమ్ ఇంక్యు (కొరియా)పై విజయం సాధించి పసిడి పతకం సాధించాడు. అలాగే మహిళల 81 కేజీల విభాగం ఫైనల్లో పూజా రాణి(భారత్) 4-1తో ప్రస్తుత ప్రపంచ చాంపియన్ వాంగ్ లీనా (చైనా)పై గెలుపొంది స్వర్ణాన్ని దక్కించుకుంది.
ఈ టోర్నిలో ఫైనల్లో ఓడిన దీపక్ సింగ్ (49 కేజీలు), కవిందర్ (56 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సిమ్రన్‌జిత్ (64 కేజీలు)లకు రజత పతకాలు లభించాయి. సెమీస్‌లో ఓడిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ (51 కేజీలు), సోనియా (57 కేజీలు), మనీషా (54 కేజీలు), సరితా దేవి (60 కేజీలు), శివ థాపా (60 కేజీలు), ఆశిష్ (69 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు)లకు కాంస్యాలు దక్కాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు స్వర్ణాలు
ఎప్పుడు : ఏప్రిల్ 26
ఎవరు : అమిత్ పంఘల్, పూజా రాణి
ఎక్కడ : బ్యాంకాక్, థాయ్‌లాండ్

Published date : 27 Apr 2019 05:32PM