Skip to main content

ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం: ఐక్యరాజ్యసమితి

కోవిడ్-19 (క‌రోనా వైరస్) మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని అంచనా వేస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 2020 ఏడాది మాంద్యంలోకి జారుకోనుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
Current Affairs

కోవిడ్‌-19 సృష్టించిన విలయానికి ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతుల మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో అపూర్వమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొంటున్నందున ఈ ముప్పు ఏర్పడనుందని తెలిపింది. ఈ సంక్షోభం నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను ఆదుకోవాలంటే 2.5 ట్రిలియన్‌ డాలర్ల సహాయ ప్యాకేజీ అవసరమని ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సీటీఎడీ) కాన్ఫరెన్స్‌ అంచనావేసింది.


భారత్,
చైనా మిన‌హా..
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో పోల్చితే, మహమ్మారి కరోనా ఆర్ధిక షాక్ అభివృద్ధి చెందుతున్న దేశాలను భారీగా తాకనుందని యుఎన్‌సీటీఎడీ తెలిపింది. ప్రపంచ ఆర్ధికవ్యవస్థ ఈ ఏడాది ట్రిలియన్ డాలర్లలో ప్రపంచ ఆదాయాన్ని కోల్పోతుందని వివ‌రించింది. చైనా, భారత్ మినహా అభివృద్ధి చెందుతున్న దేశాలకు తీవ్రమైన ఇబ్బందిని కలిగిస్తుందని పేర్కొంది. ప్ర‌స్తుతం యుఎన్‌సీటీఎడీ సెక్రటరీ జనరల్ గా ముఖిసా కిటుయ్ ఉన్నారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : 2020 ఏడాదిలో ఆర్థిక మాంద్యంలోకి ప్రపంచం
ఎప్పుడు : మార్చి 31
ఎవరు : ఐక్యరాజ్యసమితి వాణిజ్య అభివృద్ధి (యుఎన్‌సీటీఎడీ) కాన్ఫరెన్స్‌
ఎందుకు : క‌రోనా వైర‌స్ ప్రభావంతో
Published date : 02 Apr 2020 12:35PM

Photo Stories