ఆర్‌టీఐ కమిషనర్ల పదవీకాలం మూడేళ్లకు కుదింపు
Sakshi Education
దేశవ్యాప్తంగా సమాచార హక్కు కమిషనర్ల పదవీకాలాన్ని మూడేళ్లకు కుదించే ప్రతిపాదన సహా.. సమాచార హక్కు చట్టం నూతన నిబంధనలకు కేంద్రప్రభుత్వం అక్టోబర్ 25న ఆమోదం తెలిపింది.
దీంతో వేతనం, ఇతర అలవెన్సులు, సర్వీసు నిబంధనల విషయంలో నిర్ణయాధికారం కేంద్రానికి లభించింది. ఇకపై అన్ని నియామకాలకు కొత్త నిబంధనలు వర్తించనున్నాయి. సమాచార హక్కు చట్టం-2005లో సమాచార హక్కు కమిషనర్ల పదవీ కాలాన్ని కచ్చితంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్ల వయసు వచ్చేవరకు అని నిర్ణయించారు. తాజా నిబంధనల్లో దాన్ని మూడేళ్లకు కుదించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌టీఐ కమిషనర్ల పదవీకాలం మూడేళ్లకు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌టీఐ కమిషనర్ల పదవీకాలం మూడేళ్లకు కుదింపు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : కేంద్రప్రభుత్వం
Published date : 26 Oct 2019 05:54PM