ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు
చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని ఏప్రిల్ 28న వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్‌ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు.
యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర..
యువత, శాంతిభద్రతలు అనే అంశంపై చరిత్రాత్మక తీర్మానాన్ని ఆమోదించి అయిదేళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని జరిగిన సమావేశంలో ఐక్యరాజ్య సమితి(ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెర్రస్ మాట్లాడారు. లాక్‌డౌన్ సమయంలో పనిలేక తీవ్ర నిరాశ నిస్పహల్లో ఉన్న యువతను ఆకర్షించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అసాధారణ పరిస్థితులున్న ఈ తరుణంలో ఒక తరాన్ని పోగొట్టుకోలేమని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : యూనిసెఫ్
ఎందుకు : కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతున్నందున