ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువులను ఏ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి తీసుకురానున్నారు?
Sakshi Education
దేశంలో ఎరువుల కొరత తీర్చేందుకు... రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్) యూరియా ఉత్పత్తికి సిద్ధమైంది.
ట్రయల్‌రన్‌లో భాగంగా ఫిబ్రవరి 28న యూరియా ట్యాంక్, బ్యాగింగ్ యూనిట్‌ను రన్ చేశారు. ఈ ప్రక్రియ సందర్భంగా టెక్నికల్ గ్రేడ్ యూరియాను ఉత్పత్తి చేశారు. కిసాన్ బ్రాండ్ పేరుతో ఎరువులను అందుబాటులోకి తీసుకువస్తామని ఆర్‌ఎఫ్‌సీఎల్ సీఈవో నిర్లిప్‌సింగ్ రాయ్ తెలిపారు.
ఆర్‌ఎఫ్‌సీఎల్ పేరుతో...
రామగుండంలో ఫర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) పేరిట గతంలో నడిచిన ఈ కర్మాగారం నష్టాల కారణంగా మూతపడింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిని ఆర్‌ఎఫ్‌సీఎల్ పేరుతో పూర్తి గ్యాస్ ఆధారంగా రూ.5,920.55 కోట్ల అంచనాతో పునరుద్ధరణ చేపట్టింది. ఈ ప్రాజెక్టులో నేషనల్ ఫర్టిలైజర్స్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎఫ్‌సీఐ భాగస్వాములుగా ఉన్నాయి. ప్రాజెక్టులో నిత్యం 2,200 టన్నుల అమ్మోనియా, 3,850 టన్నుల యూరియాను ఉత్పత్తి చేయనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కిసాన్ బ్రాండ్ పేరుతో మార్కెట్‌లోకి ఎరువులు
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ కర్మాగారం (ఆర్‌ఎఫ్‌సీఎల్

Published date : 01 Mar 2021 06:10PM