Skip to main content

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ ఏజీఎం సుజాతకు భూషణ్ అవార్డు

కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఏటా ఇచ్చే ప్రతిష్టాత్మక ‘ఆయుధ భూషణ్ అవార్డు’కు మెదక్ జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అదనపు జనరల్ మేనేజర్ సుజాత గోగినేని ఎంపికయ్యారు.
Current Affairs అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2019 సంవత్సరానికి సుజాతను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీల డెరైక్టర్ జనరల్ గగన్ చతుర్వేది తెలిపారు. ఆయుధ ఫ్యాక్టరీలలో విశిష్ట సేవలందించినందుకు గాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. 2020, మార్చి 18న కోల్‌కతాలో జరగనున్న కార్యక్రమంలో సుజాతకు ఈ అవార్డును అందజేస్తారు.

గుంటూరు జిల్లాకి చెందిన సుజాత బల్గేరియాలో ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ అనంతరం రక్షణ శాఖలో ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరారు. మెదక్, చెన్నై, కోల్‌కతా తదితర ప్రాంతాల్లోని ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలలో వివిధ హోదాల్లో పనిచేశారు. యుద్ధ వాహనాల ఉత్పత్తి, విమానాల విడి పరికరాలు, నాణ్యతా ప్రమాణాల మదింపు, కర్మాగారం నిర్వహణ వంటి విభాగాలకు గత 30 ఏళ్లుగా అధిపతిగా ఉన్నారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి అవార్డులు
శంషాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి 2019 సంవత్సరానికి ఎయిర్‌పోర్‌‌ట్స కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సర్వీస్ క్వాలిటీ డిపార్చర్స్ అవార్డులు వరించాయి. ఆసియా పసిఫిక్ ప్రాంతం, 1.5-2.5 కోట్ల మంది ప్రయాణికుల విభాగంలో బెస్ట్ ఎయిర్‌పోర్ట్, బెస్ట్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఆంబియెన్స్‌ అవార్డులు దక్కాయి. 2020, సెప్టెంబరులో పోలండ్‌లో అవార్డుల కార్యక్రమం జరుగనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆయుధ భూషణ్ అవార్డు-2019కు ఎంపిక
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : సుజాత గోగినేని
ఎందుకు : ఆయుధ ఫ్యాక్టరీలలో విశిష్ట సేవలందించినందుకు
Published date : 10 Mar 2020 09:04PM

Photo Stories