ఆర్‌డీఐఎఫ్‌తో ఒప్పందం చేసుకున్న భారత ఫార్మా దిగ్గజం?
Sakshi Education
రష్యాకు చెందిన స్పుత్నిక్-వీ కరోనా వ్యాక్సిన్‌ను భారత్‌లో పెద్ద ఎత్తున తయారు చేయనున్నారు.
ఏడాదికి 10 కోట్ల స్పుత్నిక్-వీడోసులకు పైగా డోసుల్ని ఉత్పత్తి చేయడానికి భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) ఒప్పందం కుదుర్చుకుంది. 2021 ఏడాది మొదట్లో ఉత్పత్తిని భారత్‌లో ప్రారంభిస్తామని నవంబర్ 27న ఆర్‌డీఐఎఫ్ తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలు వెనెజులా, భారత్ తదితర దేశాల్లో జరుగుతున్నాయి. 50కి పైగా దేశాల నుంచి 1,200 కోట్లకు పైగా టీకా డోసులు కావాలంటూ రష్యాకు విజ్ఞప్తులు అందాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత్ ఫార్మా దిగ్గజం హెటిరోతో ఒప్పందం
ఎప్పుడు : నవంబర్ 27
ఎవరు : రష్యా డెరైక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్)
ఎందుకు : భారత్‌లో పెద్ద ఎత్తున స్పుత్నిక్-వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు

Published date : 28 Nov 2020 05:59PM