Skip to main content

ఆర్‌బీఐ మని యాప్ ప్రారంభం

కంటి చూపు సరిగా లేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా రూపొందించిన ‘మని(MANI)’ యాప్‌ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంత దాస్ జనవరి 1న ప్రారంభించారు. మని అప్లికేషన్ సాయంతో కంటి చూపు సరిగా లేని వారు సులువుగా నోట్లను గుర్తించవచ్చని ఆర్‌బీఐ అధికారులు వెల్లడించారు
. Jobsఈ యాప్‌ను ఒకసారి ఇన్‌స్టాల్ చేసుకుంటే ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుందని తెలిపారు. ఈ యాప్ కెమెరా సాయంతో కరెన్సీ నోట్లను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ ద్వారా సమాధానం ఇస్తుందని పేర్కొన్నారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఉచితంగానే దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆర్‌బీఐ మని యాప్ ప్రారంభం
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్
ఎందుకు : కంటి చూపు సరిగా లేని వారు కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా

మాదిరి ప్రశ్నలు

1. నీతిఆయోగ్ భారత సుస్థిర అభివృద్ధి లక్ష్యాల(ఎస్‌డీజీ) సూచీ-2019 నివేదికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది?
1. హిమాచల్ ప్రదేశ్
2. ఆంధ్రప్రదేశ్
3. కేరళ
4. తెలంగాణ

Published date : 02 Jan 2020 06:24PM

Photo Stories