ఆర్‌బీఐ ఇన్నోవేషన్ హబ్ తొలి చైర్మన్‌గా నియమితులైన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు?
Sakshi Education
రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్(ఆర్‌బీఐహెచ్) మొట్టమొదటి చైర్మన్‌గా ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సేనాపతి (క్రిష్) గోపాలకృష్ణన్ నియమితులయ్యారు.
ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) నవంబర్ 17న ఒక ప్రకటన విడుదల చేసింది. చైర్మన్ నేతృత్వంలో పనిచేసే ఆర్‌బీఐహెచ్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులను కూడా ఆర్‌బీఐ నియమించింది.
ఆర్‌బీఐహెచ్ ఏర్పాటు లక్ష్యం...
అందరికీ ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యంగా ఆర్‌బీఐహెచ్‌ను ఏర్పాటుచేయనున్నట్లు 2020, ఆగస్టులో ఆర్‌బీఐ ప్రకటించింది. టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తూ ఫైనాన్షియల్ రంగంలో కొత్త ఆవిష్కరణలు, ఇందుకు తగిన పరిస్థితులను నెలకొల్పడం ఆర్‌బీఐహెచ్ ఏర్పాటు ప్రధాన లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌బీఐహెచ్ మొట్టమొదటి చైర్మన్‌గా నియామకం
ఎప్పుడు : నవంబర్ 17
ఎవరు : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు సేనాపతి (క్రిష్) గోపాలకృష్ణన్
ఎందుకు : అందరికీ ఆర్థిక సేవల విస్తరణ లక్ష్యంగా...

Published date : 18 Nov 2020 05:39PM