Skip to main content

ఆర్‌బీఐ 25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల

దేశ ఆర్థిక అంశాలపై రూపొందించిన ‘25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక’ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) డిసెంబర్ 27న విడుదల చేసింది.
Current Affairs‘‘ద్రవ్యలోటు గణాంకాలు గత కొన్నేళ్లలో మెరుగుపడ్డాయి. కానీ, ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు బలహీన పడడం కారణంగా తగ్గిపోతున్న ఆదాయంతో ద్రవ్యలోటు సవాలు కాగలదు’’ అని ఈ నివేదిక పేర్కొంది. చాలా ప్రతికూలతలు ఉన్నప్పటికీ.. దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో బలంగా ఉందని అభిప్రాయపడింది. పడిపోతున్న ప్రభుత్వ ఆదాయం ద్రవ్య గణాంకాలపై ప్రభావం చూపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది.

గరిష్టస్థాయికి విదేశీ మారకపు నిల్వలు
భారత విదేశీ మారకపు (ఫారెక్స్) నిల్వలు జీవితకాల గరిష్టస్థాయికి చేరాయి. డిసెంబరు 20తో ముగిసిన వారానికి 456 మిలియన్ డాలర్లు (సుమారు రూ.3,200 కోట్లు) పెరిగి, 454.95 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.32.3 లక్షల కోట్లు) చేరాయని ఆర్‌బీఐ వెల్లడించింది. అంత క్రితం వారం ఫారెక్స్ నిల్వలు 1.07 బి.డాలర్లు పెరిగి, 454.49 బి.డాలర్లకు చేరిన సంగతి తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
25వ ఆర్థిక స్థిరత్వ నివేదిక విడుదల
ఎప్పుడు : డిసెంబర్ 27
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
Published date : 28 Dec 2019 06:18PM

Photo Stories