Skip to main content

ఆర్‌ఆర్‌వీఎల్‌లో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనున్న సౌదీ సంస్థ?

ఇండస్ట్రీస్ రిటైల్ వ్యాపార అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ (ఆర్‌ఆర్‌వీఎల్)లోకి మరో భారీ పెట్టుబడి వచ్చిచేరింది.
Current Affairsసౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్‌ఆర్‌వీఎల్ నవంబర్ 5న ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. పీఐఎఫ్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను వెచ్చించింది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి.

నిధుల సమీకరణ ఇలా...
సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తమ సంస్థలో 2.04 శాతం వాటాను కొనుగోలు చేయనుందని, దీనిద్వారా రూ.9,555 కోట్ల నిధులను సమీకరించినట్లు ఆర్‌ఆర్‌వీఎల్ నవంబర్ 5న ప్రకటించింది. తాజా పెట్టుబడుల సమీకరణతో రిలయన్స్ రిటైల్ విభాగం విలువ దాదాపు రూ.4.587 లక్షల కోట్లుగా లెక్కతేలుతోంది. పీఐఎఫ్ ఇప్పటికే జియో ప్లాట్‌ఫామ్స్‌లో కూడా 2.32 శాతం వాటాను కొనుగోలు చేసింది. దీనికోసం రూ.11,367 కోట్లను వెచ్చించింది. ఆర్‌ఆర్‌వీఎల్‌కు వివిధ విభాగాల్లో దేశవ్యాప్తంగా 12,000 పైగా స్టోర్స్ ఉన్నాయి.

నిధుల సమీకరణ ఇలా...

ఇన్వెస్టర్

వాటా పెట్టుబడి

విలువ (రూ. కోట్లలో)

సిల్వర్ లేక్

2.13

9,375

కేకేఆర్

1.28

5,550

జనరల్ అట్లాంటిక్

0.84

3,675

జీఐసీ

1.22

5,510

టీపీజీ

0.41

1,840

ముబాదలా

1.4

6,248

ఏడీఐఏ

1.2

5,512

సౌదీ పీఐఎఫ్

2.04

9,555

మొత్తం

10.52

47,265

క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆర్‌ఆర్‌వీఎల్‌లో 2.04 శాతం వాటా కొనుగోలు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (పీఐఎఫ్)

Published date : 06 Nov 2020 06:03PM

Photo Stories