Skip to main content

ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం

తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి తెలిపారు.
Current Affairs
ప్రాజెక్టు విషయమై ఫిబ్రవరి 22న కేంద్ర రహదారులు రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీతో చర్చించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రాన్ని మార్చే ప్రాజెక్టుగా ఈ రోడ్డు ఉండబోతోందన్నారు.
మంత్రి తెలిపిన వివరాల ప్రకారం...
  • హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డుకు 30 కి.మీ. దూరంలో 338 కిలోమీటర్ల మేర ఆర్‌ఆర్‌ఆర్‌ ఉంటుంది.
  • రెండు దశల్లో నిర్మించే ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.17 వేల కోట్లలో భూసేకరణకు రూ.4 వేల కోట్లు అవుతుంది. అందులో రాష్ట్ర వాటా కింద రూ.1,905 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది.
  • సంగారెడ్డి నుంచి తూప్రాన్‌ మీదుగా చౌటుప్పల్‌ వరకు నిర్మించబోయే మొదటి దశకు 2017లోనే జాతీయ రహదారి 161ఏఏగా కేంద్రం గుర్తించింది.
  • చౌటుప్పల్‌–షాద్‌నగర్‌ మీదుగా కంది వరకు ఉన్న రెండో దశకు జాతీయ రహదారి నంబర్‌ కేటాయించాలి.
  • రూ.10వేల కోట్లతో మొదటిదశ రహదారి నిర్మాణ పనులు జరుగుతాయి.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : తెలంగాణ రీజనల్‌ రింగ్‌ రోడ్డు(ఆర్‌ఆర్‌ఆర్‌) ప్రాజెక్టుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 22
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎక్కడ : తెలంగాణ
ఎందుకు : తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం
Published date : 23 Feb 2021 05:59PM

Photo Stories