Skip to main content

Daily Current Affairs in Telugu: ఏప్రిల్‌ 5, 2023 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu April 5th 2023 (డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
April 5th 2023 Current Affairs

New Secretariat: ఏప్రిల్ 30న నూత‌న‌ సచివాలయం ప్రారంభం..  
డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ తెలంగాణ సచివాలయం నూతన భవనాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఏప్రిల్‌ 30న ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవ ఏర్పాట్లపై ఏప్రిల్ 4వ తేదీ ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్షించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సచివాలయం ప్రారంభం కాగానే ముందుగా సీఎం కె.చంద్రశేఖర్‌రావు తన చాంబర్‌లో ఆసీనులు కానున్నారు. ఆ తర్వాత మంత్రులు, కార్యదర్శులు సీఎంవో, సచివాలయ సిబ్బంది వారి చాంబర్లలోకి వెళ్లి కూర్చోనున్నారు.
సచివాలయ ప్రారంబోత్సవం సందర్భంగా రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉదయం శాస్త్రోక్తంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అనంతరం పండితులు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభ కార్యక్రమం జరగనుంది. సంబంధిత సమయాన్ని త్వరలో ప్రకటించనున్నారు.
సచివాలయ ప్రారంబోత్సవ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, అన్ని శాఖల అధిపతులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, జెడ్పీ, డీసీసీబీ, డీసీఎంఎస్, జిల్లా గ్రంథాలయాల చైర్మన్లు, జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు మేయర్లు తదితరులు కలిపి దాదాపు 2,500 మంది హాజరవుతారని అంచనా. 

Arogya Mahila Scheme: తెలంగాణ‌లో ‘ఆరోగ్య మహిళ’ ప‌థ‌కం ప్రారంభం
నాలుగు ద్వారాలు.. 
సచివాలయం నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలున్నాయి.  తూర్పు ద్వారాన్ని (మెయిన్‌ గేట్‌) ముఖ్యమంత్రి, సీఎస్, డీజీపీ, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, చైర్మన్లు ఇంకా ముఖ్యమైన ఆహ్వానితులు, దేశ, విదేశీ అతిథులు, ప్రముఖుల కోసం మాత్రమే వినియోగించనున్నారు. వాయవ్య (నార్త్‌–వెస్ట్‌) ద్వారాన్ని అవసరం వచ్చినప్పుడే తెరవనున్నారు. ఈశాన్య (నార్త్‌–ఈస్ట్‌) ద్వారం గుండా సచివాలయ సిబ్బంది కార్యదర్శులు, అధికారుల రాకపోకలు సాగించనున్నారు. అదే వైపు పార్కింగ్‌ కూడా ఉండనుంది. ఆగ్నేయ (సౌత్‌–ఈస్ట్‌) ద్వారాన్ని కేవలం సందర్శకుల కోసమే తెరవనున్నారు. 
సచివాలయ సందర్శన సమయం..
సచివాలయ సందర్శన సమయం మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఉండనుంది. వికలాంగులు, వృద్ధుల కోసం విద్యుత్‌తో నడిచే బగ్గీల ఏర్పాటు చేయనున్నారు. ప్రైవేటు వాహనాలకు సచివాలయంలోకి అనుమతి లేదు.  

వీక్లీ కరెంట్ అఫైర్స్ (Persons) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Finland Joins NATO: నాటో కూటమిలోకి ఫిన్లాండ్‌..  
ఉక్రెయిన్‌పై దండయాత్రకు దిగిన రష్యా తమపైనా దాడికి యత్నించవచ్చనే భయాలతో ఫిన్లాండ్‌ దేశం ఏప్రిల్ 4వ తేదీ నాటో కూటమిలో 31వ సభ్యదేశంగా చేరింది. దీంతో రష్యా వెంట నాటో సభ్య దేశాల సరిహద్దు భూభాగ విస్తీర్ణం రెట్టింపయింది. దీనిని యూరప్‌ రక్షణ ముఖచిత్రంలో కీలక పరిణామంగా భావిస్తున్నారు. నాటోలో సభ్యత్వం కోసం ఉక్రెయిన్‌ ప్రయత్నించడాన్ని ప్రధాన కారణంగా చూపుతూ ఆ దేశంపై యుద్ధానికి దిగిన రష్యాకు తాజాగా ఫిన్లాండ్‌ రూపంలో వ్యూహాత్మక, రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. గతంలో రెండో ప్రపంచ యుద్ధంలో సోవియెట్ల చేతిలో ఓటమి పాలైనప్పటి నుంచి ఫిన్లాండ్‌ తటస్థ వైఖరినే అవలంభిస్తోంది. కానీ ఉక్రెయిన్‌ యుద్ధం దరిమిలా రష్యాకు భయపడి ఫిన్లాండ్‌ నాటో రక్షణ ఛత్రం కిందకు చేరక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో గత మే నెలలోనే నాటో సభ్యత్వం కోసం దరఖాస్తు చేసుకుంది. 

ChatGPT: చాట్‌జీపీటీపై నిషేధం.. డేటా లీక్ చేసినందుకే..!
నాటోలోని మొత్తం 30 దేశాలూ ఆమోదిస్తేనే సభ్యత్వం ఇస్తారు. గత కొద్ది నెలలుగా హంగేరీ, తుర్కియేలు ఫిన్లాండ్‌ దరఖాస్తుకు ఆమోదముద్రవేయలేదు. ఫిన్లాండ్‌తోపాటు స్వీడన్‌ సైతం దరఖాస్తు చేసుకోగా ఇంకా హంగేరీ, తుర్కియేలు పచ్చజెండా ఊపలేదు. 
తగిన చర్యలుంటాయ్‌: రష్యా 
ఫిన్లాండ్‌ నాటో సభ్యత్వంపై రష్యా ఘాటుగా స్పందించింది. ‘నాటోలో చేరడం ద్వారా ఫిన్లాండ్‌ నుంచి ఎదురయ్యే జాతీయ భద్రతా సవాళ్లను సైనిక, సాంకేతిక, తదితర మార్గాల్లో దీటుగా ఎదుర్కొంటాం. తగు చర్యలు తీసుకుంటాం. ఉత్తర యూరప్‌లో దశాబ్దాలుగా కొనసాగుతున్న సుస్థిరతకు ఫిన్లాండ్‌ భంగం కల్గించింది’ అని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఫిన్లాండ్‌ సాయం అడగనంత వరకు ఆ దేశానికి అదనపు సైన్యాన్ని పంపే యోచన లేదని నాటో ప్రధాన కార్యదర్శి జీన్స్‌ స్టోలెన్‌బర్గ్‌ చెప్పారు. 

Tax Relief: ట్యాక్స్ పేయర్లకు ఊరట.. నిర్మలా సీతారామన్ కీల‌క నిర్ణ‌యం!

India-Bhutan Relations: భూటాన్‌తో పటిష్ట బంధానికి ఐదు సూత్రాల రోడ్‌ మ్యాప్ 
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న భూటాన్‌ రాజు జిగ్మే ఖేసర్‌ నాంగెల్‌ వాంగ్‌చుక్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 4న‌ పలు ద్వైపాక్షిక అంశాలపై లోతుగా చర్చలు జరిపారు. ద్వైపాక్షిక బంధం బలోపేతానికి ఐదు సూత్రాల రోడ్‌మ్యాప్‌ను వాంగ్‌చుక్‌ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. భేటీ వివరాలను క్వాట్రా మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా డోక్లాంపై ప్రశ్నించగా ఆయన ఇలా స్పందించారు. భద్రతకు సంబందించిన అన్ని అంశాల్లోనూ ఇరు దేశాలు పరస్పరం సహకారం ఇచ్చిపుచ్చుకుంటున్నట్టు చెప్పారు. దీన్ని మరింత విస్తృతం చేసుకునేందుకు భూటాన్‌ రాజు పర్యటన దోహదపడుతోందన్నారు. అసోంలోని కోక్రాఝార్‌ నుంచి భూటాన్‌లోని గెలెపు వరకు రైల్‌ లింక్‌ ప్రాజెక్టు పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. ఇటీవలి కాలంలో భూటాన్‌ క్రమంగా చైనాకు దగ్గరవుతోందన్న అభిప్రాయాల మధ్య ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. వాంగ్‌చుక్‌తో చర్చలు ఫలప్రదంగా జరిగాయంటూ మోదీ ట్వీట్‌ చేశారు. డోక్లాం అంశానికి సంబంధించి భూటాన్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా తెలిపారు. 

CBI Diamond Jubilee: సీబీఐ వజ్రోత్సవ వేడుకలు.. న్యాయానికి తిరుగులేని బ్రాండ్‌ అంబాసిడర్‌ సీబీఐ
డోక్లాం.. అతి కీలకం 
వ్యూహాత్మకంగా డోక్లాం భారత్‌కు అత్యంత కీలకం. 2017లో అక్కడ భారత, చైనా సైనికులు ఏకంగా 73 రోజుల పాటు ఎదురెదురుగా మోహరించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. భూటాన్‌లో తమదిగా చెప్పుకుంటున్న ప్రాంతంలో రోడ్డు వేసేందుకు చైనా ప్రయత్నించడం ఘర్షణకు కారణమైంది. దాన్ని భారత్‌ తీవ్రంగా వ్యతిరేకించింది. భూటాన్‌కు చైనాతో 400 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది.  

Fumio Kishida India Visit: జపాన్‌తో బంధం బలోపేతం.. కిషిదా, మోదీ చర్చలు

Sikkim Avalanche: సిక్కింలో భారీ హిమపాతం 
సిక్కింలోని హిమాలయ పర్వతసానువుల్లోని లోయ మార్గం నాథూ లా ప్రాంతంలో ఏప్రిల్ 4వ తేదీ సంభవించిన భారీ హిమపాతం ధాటికి ఏడుగురు పర్యాటకులు మంచులో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో ఒక మహిళ, ఒక చిన్నారి కూడా ఉన్నారు. 11 మంది గాయపడ్డారు. ఐదారు వాహనాలతోసహా దాదాపు 30 మంది మంచు దిబ్బల కింద చిక్కుకున్నారన్న అనుమానాలతో అక్కడ అన్వేషణ, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్యాంగ్‌టాక్, నాథూ లాను కలిపే జవహర్‌లాల్‌ నెహ్రూ మార్గంలోని 14వ నంబర్‌ మైలురాయి వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. 

వీక్లీ కరెంట్ అఫైర్స్ (International) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)
 
Hush Money Case: మన్‌హాటన్‌ కోర్టులో విచారణకు హాజ‌రైన ట్రంప్‌  
హష్‌ మనీ చెల్లింపుల కేసులో ఏప్రిల్ 4న‌ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (76) మన్‌హాటన్‌ క్రిమినల్‌ కోర్టు ముందు విచారణకు హాజరయ్యారు. ‘మిస్టర్‌ ట్రంప్‌! యూ ఆర్‌ అండర్‌ అరెస్ట్‌’ అని చెప్పి పోలీసులు ఆయన్ను లోనికి తీసుకెళ్లినట్టు సమాచారం. అనంతరం విచారణకు ముందు రికార్డుల నిమిత్తం ట్రంప్‌ వేలిముద్రలు, ఫొటో తీసుకున్నారు. మామూలుగా నిందితుల మాదిరిగా బేడీలు వేయకుండానే ఆయన్ను జడ్జి ముందు హాజరు పరిచారు. ఈ సందర్భంగా సీక్రెట్ సర్వీస్‌ బాడీగార్డులు ట్రంప్‌ వెన్నంటే ఉన్నారు. అనంతరం ట్రంప్‌పై దాఖలైన 34 అభియోగాలను జడ్జి జువాన్‌ మాన్యుయల్‌ మర్చన్‌ చదివి వినిపించారు. వాటిలో దేనితోనూ తనకు సంబంధం లేదని, నేనే ఏ నేరమూ చేయలేదంటూ కోర్టు ముందు ట్రంప్ వాంగ్మూలమిచ్చారు. తనపై నమోదైన క్రిమినల్‌ నేరాభియోగాలను ట్రంప్ అంగీకరించలేదు. ప్రతి అభియోగాన్నీ చట్టపరంగా ఎదుర్కొంటారని ఆయన లాయర్లు తెలిపారు. అనంతరం కోర్టు నుంచి ఫ్లోరిడా పయనమయ్యారు. కాగా ట్రంప్‌ అధ్యక్షునిగా ఉండగానే  హష్‌ మనీ కేసులో మన్‌హాటన్‌ జిల్లా అటార్నీ కార్యాలయం ఆయనపై విచారణ మొదలు పెట్టింది.
తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్‌..
శృంగార చిత్రాల నటి స్టార్మీ డేనియల్స్‌(44)తో అఫైర్‌ను కప్పిపుచ్చేందుకు ఆమెకు డబ్బుల చెల్లింపు వ్యవహారం ట్రంప్‌ మెడకు చుట్టుకోవడం, క్రిమినల్‌ నేరాభియోగాలకు దారితీయడం తెలిసిందే. అమెరికా చరిత్రలో అభియోగాలు ఎదుర్కొంటున్న తొలి మాజీ అధ్యక్షునిగా ట్రంప్‌ నిలిచారు.  

International Criminal Court: పుతిన్‌ను బోనెక్కించడం ఐసీసీకి సాధ్యమేనా.. అస‌లు పుతిన్‌పై ఉన్న ఆరోపణలేంటి?


World Bank: భారత్‌ వృద్ధి రేటుకు ప్రపంచ బ్యాంక్‌ కోత
భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఏప్రిల్‌తో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతానికి పరిమితమవుతుందని ప్రపంచ బ్యాంక్‌ అంచనా వేసింది. ఈ మేరకు క్రితం అంచనాలను 6.6 శాతం నుంచి 30 బేసిస్‌ పాయింట్లు తగ్గించింది. పెరుగుతున్న వడ్డీరేట్లు, ఆదాయ వృద్ధి మందగమనం, అధిక ధరలు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి పరిస్థితులు తన క్రితం అంచనాల తాజా తగ్గింపునకు కారణమని దక్షిణాసియాకు సంబంధించి ఆవిష్కరించిన నివేదికలో బహుళజాతి బ్యాంకింగ్‌ దిగ్గజం పేర్కొంది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌), ప్రపంచ బ్యాంకు వార్షిక (స్ప్రింగ్‌) సమావేశాలకు ముందు వరల్డ్‌ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ (దక్షిణాసియా) హన్స్‌ టిమ్మర్‌ ఈ నివేదిక విడుదల చేశారు. నివేదికలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. 
☛ బలహీన వినియోగం, కఠిన వడ్డీరేట్ల వ్యవస్థ ముఖ్యంగా ప్రభుత్వ ప్రస్తుత వ్యయ నియంత్రణ అంచనాల డౌన్‌గ్రేడ్‌కు ప్రధాన కారణం.  

Economic Growth: 2023–24 భారత్‌ వృద్ధి రేటు.. 6 శాతం!
☛ దక్షిణాసియాలోని అనేక ఇతర దేశాల కంటే భారతదేశంలో పరిస్థితి మెరుగ్గానే ఉంది. ఆర్థిక రంగంలో పరిస్థితి ఇతర దేశాల కంటే బాగుంది. భారతదేశంలోని బ్యాంకులు పటిష్ట స్థితిలో ఉన్నాయి. మహమ్మారి తర్వాత బ్యాంకింగ్‌ చక్కటి రికవరీ సాధించింది. ఆర్థిక వ్యవస్థలో తగిన రుణాలకుగాను లిక్విడిటీ బాగుంది. ఇటీవలి సంవత్సరాలతో పోలిస్తే ప్రైవేట్‌ పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయి. సమస్యల్లా దేశం తన సామర్థ్యాన్ని తక్కువ స్థాయిలో వినియోగించుకోవడమే.   పూర్తి వివ‌రాల‌కు ఇక్క‌డ క్లిక్ చేయండి

UPI Payments: రూ.2 వేలు మించి ఫోన్‌పే, గూగుల్‌పే చెస్తే అదనపు చార్జీలు..

Mukesh Ambani: ఆసియా కుబేరుడిగా ముకేశ్‌ అంబానీ..  
ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌(ఆర్‌ఐఎల్‌) అధినేత ముకేశ్‌ అంబానీ తిరిగి టాప్‌ ర్యాంకును కైవసం చేసుకున్నారు. 83.4 బిలియన్‌ డాలర్ల సంపదతో ఆసియా కుబేరుడిగా ఆవిర్భవించారు. ప్రపంచ కుబేరుల్లో 9వ ర్యాంకును ఆక్రమించారు. వ్యక్తిగత సంపదపై ఫోర్బ్స్‌ విడుదల చేసిన 2023 ప్రపంచ బిలియనీర్ల తాజా జాబితాలో అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతమ్‌ అదానీ 24వ ర్యాంకుకు దిగిపోయారు. ఈ ఏడాది జనవరి 24న గౌతమ్‌ అదానీ 126 బిలియన్‌ డాలర్ల ఆస్తులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా మూడో ర్యాంకులో నిలిచారు. అయితే హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక నేపథ్యంలో అదానీ సంపద 47.2 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది.  

Top 10 Billionaires: అంబానీ.. టాప్‌–10 సంపన్నుల్లో ఏకైక భారతీయుడు.. 23వ స్థానంలో అదానీ
ప్రపంచ కుబేరుల తీరిలా.. 
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపదలో 38 శాతం(57 బిలియన్‌ డాలర్లు) నష్టపోయారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో రెండు నుంచి మూడో స్థానానికి తగ్గారు. ఈ ఏడాది టెస్లా చీఫ్‌ ఎలన్‌ మస్క్‌ సంపదలో 39 బిలియన్‌ డాలర్లు ఆవిరికావడంతో రెండో ర్యాంకుకు పరిమితమయ్యారు. కాగా.. విలాస వస్తువుల ఫ్రెంచ్‌ టైకూన్‌ బెర్నాల్డ్‌ ఆర్నాల్ట్‌ 211 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో తొలిసారి ప్రపంచ టాప్‌ ర్యాంకును ఆక్రమించారు. మస్క్ సంపద 180 బిలియన్‌ డాలర్లు కాగా, బెజోస్‌ ఆస్తులు 114 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

వీక్లీ కరెంట్ అఫైర్స్ (ఎకానమీ) క్విజ్ (26 ఫిబ్రవరి - 04 మార్చి 2023)

Sanjita Chanu: వెయిట్‌లిఫ్టర్‌ సంజితపై నాలుగేళ్ల నిషేధం 
డోపింగ్‌ పరీక్షలో విఫలమైన భారత వెయిట్‌లిఫ్టర్‌ సంజిత చానుపై జాతీయ డోపింగ్‌ నిరోధక సంస్థ (నాడా) నాలుగేళ్ల నిషేధం విధించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా సంజిత చాను నుంచి డోపింగ్‌ శాంపిల్స్‌ సేకరించారు. ఆమె శాంపిల్స్‌ను పరీక్షించగా ప్రపంచ డోపింగ్‌ నిరోధక సంస్థ (వాడా) నిషేధిత ఉత్ప్రేరకాల జాబితాలో ఉన్న డ్రోస్టానోలోన్‌ మెటాబోలైట్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. దాంతో సంజితపై ‘నాడా’ క్రమశిక్షణ ప్యానెల్‌ నాలుగేళ్ల నిషేధం విధించింది. మణిపూర్‌కు చెందిన 29 ఏళ్ల సంజిత పలు మెగా ఈవెంట్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. సంజిత 2014 గ్లాస్గో కామన్వెల్త్‌ గేమ్స్‌లో 48 కేజీల విభాగంలో, 2018 గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో స్వర్ణ పతకాలు సాధించింది.  

Rani Rampal: హాకీ స్టేడియానికి రాణి రాంపాల్‌ పేరు

 

Published date : 05 Apr 2023 06:22PM

Photo Stories