Skip to main content

ఆఫ్గానిస్తాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడినని ప్రకటించుకున్న నేత?

అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయినందున దేశానికి చట్టబద్ధంగా తానే ఆపద్ధర్మ అధ్యక్షుడినని ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌ ప్రకటించుకున్నారు.
అఫ్గాన్‌ రాజ్యాంగం ప్రకారం ఇలా ప్రకటించుకునే అధికారం తనకుందని సలేహ్‌ ఆగస్టు 17న ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తాలిబన్లు కాబూల్‌లోకి ప్రవేశించడంతో అష్రాఫ్‌ ఘనీ ఆగస్టు 15న దేశాన్ని వదిలి వెళ్లిపోయిన విషయం తెలిసిందే.

పౌరులందరికీ క్షమాభిక్ష
అఫ్గానిస్తాన్‌ ప్రజలందరికీ క్షమాభిక్ష పెడుతున్నట్లు తాలిబన్లు సంచలన ప్రకటన చేశారు. దేశ ప్రజల్లో తమపై ఏర్పడిన భయాందోళనలు తొలగించే యత్నాల్లో భాగంగా మహిళలు ప్రభుత్వంలో చేరాలని పిలుపునిచ్చారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : ఆఫ్గానిస్తాన్‌ ఆపద్ధర్మ అధ్యక్షుడినని ప్రకటించుకున్న నేత?
ఎప్పుడు : ఆగస్టు 17
ఎవరు : ఆఫ్గానిస్తాన్‌ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్‌
ఎందుకు : అఫ్గానిస్తాన్‌ అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయినందున...
Published date : 19 Aug 2021 06:29PM

Photo Stories