అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ ఎన్నిక
Sakshi Education
అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా అష్రాఫ్ ఘనీ మరోసారి ఎన్నికయ్యారు.
ఇండిపెండెంట్ ఎన్నికల కమిషన్ (ఈఏసీ) డిసెంబర్ 22న ప్రాథమిక ఫలితాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రకారం... అష్రాఫ్ ఘనీకి 50.64 శాతం ఓట్లు వస్తే, ఆయన ప్రత్యర్థి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అబ్దుల్లా అబ్దుల్లాకు 39.52 శాతం ఓట్లు లభించాయి. ఈఏసీ తుది ఫలితాల్ని మరికొద్ది వారాల్లో ప్రకటించనుంది. ఈలోగా ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులెవరైనా ఫలితాలపై తమకేమైనా అభ్యంతరాలుంటే వ్యక్తం చేసే హక్కు ఉంది. ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేయొచ్చు. ఈ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదని, ఫలితాల్ని సవాల్ చేస్తామని అబ్దుల్లా ప్రకటించారు. 2019, సెప్టెంబర్ 28న అఫ్గానిస్తాన్‌లో ఎన్నికలు జరిగాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : అష్రాఫ్ ఘనీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుగా ఎన్నిక
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : అష్రాఫ్ ఘనీ
Published date : 23 Dec 2019 05:37PM