Skip to main content

అఫ్గాన్ అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు

అఫ్గానిస్తాన్‌లో రాజకీయ సంక్షోభం పెరుగుతోంది. అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ, అతడి మాజీ చీఫ్ ఎగ్జిక్యుటివ్ అబ్దుల్లా అబ్దుల్లాల మధ్య విబేధాల వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
Current Affairs మార్చి 9న ఘనీ, అబ్దుల్లాలు తామే అధ్యక్షులం అంటూ ప్రమాణ స్వీకారోత్సవాలు జరుపుకున్నారు. దశాబ్దకాలం యుద్ధానికి ఫుల్‌స్టాప్ పెడుతూ అమెరికా దళాలు అఫ్గానిస్తాన్ నుంచి నిష్ర్కమిస్తున్న సమయంలో ఈ ఘటనలు జరిగాయి.

2019, సెప్టెంబరులో అఫ్గానిస్తాన్ అధ్యక్షుడి కోసం ఎన్నికలు జరిగాయి. అయితే ఘనీ, అబ్దుల్లా వర్గాలు రెండు ఎన్నికల్లో మోసాలు జరిగాయని ఆరోపణలు పరస్పర ఆరోపణలకు దిగడంతో ఫలితాల వెల్లడిలో ఆలస్యమైంది. చివరకు 2020, ఫిబ్రవరిలో ఘనీ ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఘనీ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఎన్నికల ఫలితాలను అబ్దుల్లా అబ్దుల్లా ఖాతరు చేయలేదు. తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని దేశ స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సరిహద్దులను కాపాడతానని ప్రమాణం చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అఫ్గాన్ అధ్యక్షులుగా పోటాపోటీ ప్రమాణాలు
ఎప్పుడు : మార్చి 9
ఎవరు : అష్రాఫ్ ఘనీ, అబ్దుల్లా అబ్దులా
Published date : 10 Mar 2020 08:57PM

Photo Stories