ఆనందయ్య మందుకు ప్రభుత్వం అనుమతి
Sakshi Education
కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య ఇస్తున్న మందుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.మే 31న అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆనందయ్య మందులతో దుష్ప్రభావాలు లేవని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ (సీసీఆర్‌ఏఎస్), ఇతర సంస్థలు ఇచ్చిన నివేదికల మేరకు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ఆనందయ్య ఇస్తున్న 5 (పి, ఎల్, ఎఫ్, కె, ఐ) రకాల మందుల్లో 3 (పి, ఎల్, ఎఫ్) రకాలకు అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే ఐ డ్రాప్స్ మందుకు, మరోమందు కె కు ఇంకా అనుమతి ఇవ్వలేదు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆనందయ్య మందుకు అనుమతి
ఎప్పుడు : మే 31
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కృష్ణపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
ఎందుకు :కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకుఆనందయ్య మందులతో దుష్ప్రభావాలు లేవనిక్విక్ రివ్యూ :
ఏమిటి : ఆనందయ్య మందుకు అనుమతి
ఎప్పుడు : మే 31
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : కృష్ణపట్నం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
Published date : 01 Jun 2021 06:14PM