ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం
Sakshi Education
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలో మొట్టమొదటి వ్యర్థాల బదలాయింపు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్(ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్)ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 5న తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు.
ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఈఎంసీ) ఇలా వ్యర్థాల సక్రమ నిర్వహణకు తొలి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్ రూపొందించడం మంచి పరిణామన్నారు. వ్యర్థాలను వంద శాతం సురక్షితంగా పార వేయడం, వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా పర్యవేక్షించడం, ఆడిటింగ్ చేయడం వంటి లక్ష్యాలతో ఏపీఈఎంసీ ఏర్పాటైందన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆన్‌లైన్ వేస్ట్ ఎక్స్ఛేంజ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం
ఎప్పుడు : జూన్ 5
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, గుంటూరు జిల్లా
ఎందుకు : వ్యర్థాల నిర్వహణను సమర్థవంతంగా చేయడం కోసం

Published date : 06 Jun 2020 09:15PM