ఆన్‌లైన్ చెస్ టోర్నీకి అర్హత సాధించిన ఏపీ క్రీడాకారిణి?
Sakshi Education
ఆసియా కాంటినెంటల్ ఆన్‌లైన్ సెలెక్షన్ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నూతక్కి ప్రియాంక అండర్-18 బాలికల విభాగంలో కాంస్య పతకం సాధించింది.
దీంతో ‘ఫిడే’ ఆన్‌లైన్ వరల్డ్ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు ప్రియాంకకు అర్హత లభించింది.
డిసెంబర్ 15న ముగిసిన సెలెక్షన్ టోర్నమెంట్‌లో నిర్ణీత ఏడు రౌండ్‌ల తర్వాత ప్రియాంక ఐదు పాయింట్లతో యాన్ తియాన్‌కి (చైనా), కై లిన్ జాయ్ (ఫిలిప్పీన్స్)తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించగా... యాన్ తియాన్‌కికి రెండో స్థానం... ప్రియాంకకు మూడో స్థానం, కై లిన్ జాయ్‌కి నాలుగో స్థానం ఖరారయ్యాయి. 5.5 పాయింట్లతో జియో జాంగ్ (చైనా) విజేతగా నిలువడంతోపాటు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆన్‌లైన్ వరల్డ్ యూత్ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలకు అర్హత
ఎప్పుడు : డిసెంబర్ 15
ఎవరు : నూతక్కి ప్రియాంక
ఎందుకు : ఆసియా కాంటినెంటల్ ఆన్‌లైన్ సెలెక్షన్ టోర్నమెంట్‌లో కాంస్య పథకం సాధించడంతో

Published date : 16 Dec 2020 05:57PM