Skip to main content

అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు

భారత సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 22న న్యూఢిల్లీలో మొదలైన అంతర్జాతీయ న్యాయ సదస్సు ఫిబ్రవరి 23న ముగిసింది.
Current Affairsఫిబ్రవరి 23న జరిగిన సదస్సు ముగింపు కార్యక్రమంలో ‘న్యాయవ్యవస్థ -మారుతున్న ప్రపంచం’అంశంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. లింగపరమైన న్యాయం అనే ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని సాధించేందుకు భారత న్యాయవ్యవస్థ చేసిన కృషి అమోఘమని పేర్కొన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఎల్లప్పుడూ సానుకూల, ప్రగతిశీల దృక్పథంతోనే పనిచేసిందని కొనియాడారు.

ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 22న పాల్గొన్నారు. క్లిష్టమైన అంశాలపై ఇటీవలి కాలంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ప్రపంచవ్యాప్త చర్చకు కారణమయ్యాయని ఈ సందర్భంగా మోదీ అన్నారు. సదస్సులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే మాట్లాడుతూ... పర్యావరణ సంబంధ అంశాలకు జాతీయ, అంతర్జాతీయ అనే భేదం లేదని, వీటిని పరిష్కరించడానికి చట్టాలతో కూడిన ఒకే వ్యవస్థ అవసరమని పేర్కొన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ న్యాయ సదస్సు ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 24 Feb 2020 06:02PM

Photo Stories