Skip to main content

అంతర్జాతీయ క్రికెట్‌కు యువరాజ్ వీడ్కోలు

భారత వన్డే క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు పొందిన యువరాజ్ సింగ్ ఆటకు వీడ్కోలు పలికాడు.
అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్ నుంచి కూడా తప్పుకుంటున్నట్లు జూన్ 10న అతను వెల్లడించాడు. అయితే రిటైర్మెంట్ అనంతరం బీసీసీఐ అనుమతిస్తే ప్రపంచ వ్యాప్తంగా వేర్వేరు టి20 లీగ్‌లు ఆడాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ముంబై ఇండియన్‌‌సకు ఆఖరి సారిగా ప్రాతినిధ్యం వహించిన యువరాజ్... జాతీయ జట్టు తరఫున రెండేళ్ల క్రితం 2017 జూన్‌లో ఆఖరి వన్డే ఆడాడు. 17 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లలో కలిపి 402 మ్యాచ్‌లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

యువరాజ్ కెరీర్
జన్మదినం: 1981, డిసెంబర్ 12
పుట్టిన ప్రదేశం: చండీగఢ్

తొలి వన్డే: 2000 కెన్యాపై..
ఆఖరి వన్డే: 2017 వెస్టిండీస్‌పై
తొలి టెస్టు: 2003 న్యూజిలాండ్‌పై
ఆఖరి టెస్టు: 2012 ఇంగ్లాండ్‌పై
తొలి టీ20: 2007 స్కాట్లాండ్‌పై
ఆఖరి టీ20: 2017 ఇంగ్లాండ్‌పై

అవార్డులు..
2012: అర్జున అవార్డు
2014: పద్మశ్రీ

ఆరు బంతుల్లో ఆరు ఆర్లు
2007 టీ20 ప్రపంచకప్‌లో యువీ అద్భుతమే చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచరికార్డు సృష్టించాడు.

12 బంతుల్లో 50
2007 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌లోనే యువరాజ్ 12 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసి మరో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటికీ ఇదే రికార్డు.

ప్రపంచకప్‌లో మ్యాన్ ఆఫ్ ద టోర్నీ
2011 వన్డే ప్రపంచకప్‌లో భారత్ విజయంలో యువరాజ్‌దే కీలకపాత్ర. 362 పరుగులు చేసిన అతను.. 15 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు అందుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : జూన్ 10
ఎవరు : యువరాజ్ సింగ్
Published date : 11 Jun 2019 06:54PM

Photo Stories