Skip to main content

అంతర్జాతీయ క్రికెట్‌కు సారా వీడ్కోలు

మహిళల క్రికెట్‌లో దశాబ్ద కాలానికి పైగా తన ముద్ర చూపించిన ఇంగ్లండ్ వికెట్ కీపర్ సారా టేలర్ (30) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది.
కొంత కాలంగా భావోద్వేగాలను నియంత్రించుకోలేని ‘మానసిక బెంగ’తో బాధపడుతున్న టేలర్ ఇక ఆట తన వల్ల కాదని సెప్టెంబర్ 27న ప్రకటించింది. 17 ఏళ్ల వయసులో ఆమె 2006లో ఇంగ్లండ్ తరఫున అరంగేట్రం చేసింది. తన కెరీర్‌లో 10 టెస్టులు, 126 వన్డేలు, 90 అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లు ఆడి 6,533 పరుగులు సాధించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు
ఎప్పుడు : సెప్టెంబర్ 27
ఎవరు : ఇంగ్లండ్ వికెట్ కీపర్ సారా టేలర్ (30)
Published date : 28 Sep 2019 05:35PM

Photo Stories