Skip to main content

అంతర్జాతీయ క్రికెట్‌కు రైనా వీడ్కోలు

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు చెప్పిన కొద్ది సేపటికే అతని సహచరుడు సురేశ్ రైనా కూడా అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించాడు.
Current Affairs
తన రిటైర్మెంట్‌ సందేశాన్ని ఆగస్టు 15న ఇన్ స్ట్రగామ్‌లో పోస్ట్‌ చేశాడు. 2020, సెప్టెంబర్ నెలలో యూఏఈలో జరిగే ఐపీఎల్‌ టి20 టోర్నీలో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున రైనా ఆడనున్నాడు.

2005లో తొలి వన్డే...
ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన 33 ఏళ్ల రైనా 2005 జూలై 30న దంబుల్లా(శ్రీలంక)లో శ్రీలంకపై తొలి వన్డే ఆడాడు. 2018 జూలై 17న లీడ్స్‌లో ఇంగ్లండ్‌పై రైనా చివరిసారి భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ నెగ్గిన భారత జట్టులో రైనా సభ్యుడిగా ఉన్నాడు.

తొలి భారతీయ క్రికెటర్‌గా...
తన 13 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్‌ కెరీర్‌లో రైనా 18 టెస్టులు, 226 వన్డేలు, 78 టి20 మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 7 అర్ధ సెంచరీలతో కలిపి 768 పరుగులు... వన్డేల్లో 5 సెంచరీలు, 36 అర్ధ సెంచరీలతో కలిపి 5,615 పరుగులు... టి20ల్లో ఒక సెంచరీ, 5 అర్ధ సెంచరీలతో కలిపి 1,605 పరుగులు సాధించాడు. మూడు ఫార్మాట్‌లలోనూ సెంచరీలు సాధించిన తొలి భారతీయ క్రికెటర్‌గా రైనా ఘనత వహించాడు. చురుకైన ఫీల్డర్‌గా గుర్తింపు పొందిన రైనా తన కెరీర్‌ మొత్తంలో 167 క్యాచ్‌లు (టెస్టుల్లో 23+వన్డేల్లో 102+టి20ల్లో 42) తీసుకున్నాడు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కువీడ్కోలు
ఎప్పుడు : ఆగస్టు 15
ఎవరు : సురేశ్ రైనా
Published date : 17 Aug 2020 05:31PM

Photo Stories