అంతర్జాతీయ కోర్టుకు నిర్భయ దోషులు
Sakshi Education
నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు ది హెగ్‌లోని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) తలుపు తట్టారు.
తమకు ఉరిశిక్ష విధింపు చట్టవిరుద్ధమని, నిలిపివేయాలని ఐసీజేను కోరారు. దోషుల తరఫు లాయర్ ఏపీసింగ్ ఈ మేరకు ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్ సింగ్ పెట్టుకున్న పిటిషన్ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించింది. 2020, మార్చి 20వ తేదీన దోషులు ముకేశ్ సింగ్(32), అక్షయ్ సింగ్(31), పవన్‌గుప్తా(25), వినయ్ శర్మ(26)కు ఉరిశిక్ష అమలు చేయాలంటూ మార్చి 5వ తేదీన తాజాగా న్యాయస్థానం వారెంట్లు జారీ చేసిన విషయం తెలిసిందే.
Published date : 17 Mar 2020 08:53PM