అంతరిక్షంలో స్టార్ హోటల్ నిర్మించనున్న సంస్థ?
Sakshi Education
అంతరిక్ష యాత్రికుల కోసం అంతరిక్షంలో అత్యాధునిక హోటల్ నిర్మించేందుకు ‘ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్’ అనే సంస్థ సిద్ధమవుతోంది.
భూమికి 2వేల కి.మీ ఎత్తు వరకు ఉండే కక్ష్యను భూ నిమ్న కక్ష్య అంటారు. ఈ కక్ష్యలోనే అమెరికా, జపాన్, రష్యా, యూరప్, కెనడా కలిపి అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాయి. ఈ కేంద్రానికి దగ్గరలోనే ‘‘వాయేజర్ స్టేషన్’’ పేరుతో ఒక హోటల్ నిర్మించాలని ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్ సంస్థ నిర్ణయించింది. హోటల్ నిర్మాణం 2025లో ప్రారంభించి.. 2027నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించింది. అంతరిక్షంలో వేలాడుతూ.. తిరుగుతూ ఉండే ఈ హోటల్ ప్రతి 90 నిమిషాలకు ఒక భ్రమణం పూర్తి చేస్తుందని వెల్లడించింది.
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాయేజర్ స్టేషన్ పేరుతో హోటల్ నిర్మాణం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్
ఎక్కడ : అంతరిక్షంలో
ఎందుకు : అంతరిక్ష యాత్రికుల కోసం
క్విక్ రివ్యూ:
ఏమిటి : వాయేజర్ స్టేషన్ పేరుతో హోటల్ నిర్మాణం
ఎప్పుడు : మార్చి 3
ఎవరు : ఆర్బిటల్ అసెంబ్లీ కార్పొరేషన్
ఎక్కడ : అంతరిక్షంలో
ఎందుకు : అంతరిక్ష యాత్రికుల కోసం
Published date : 04 Mar 2021 06:26PM